
రాజకీయాలు

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ సినిమాపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని సమాచారం.
తాజాగా విజయ్ సేతుపతి కూడా టీజర్‌కు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ లేకపోయినా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా హైప్ మరింత పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!