

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 29’. ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్ పై దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈవెంట్‌కి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళి స్వయంగా వీడియో బైట్ ద్వారా తెలిపారు.
ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా వరుసగా సరికొత్త అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. మొదటగా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్ పై కొందరు విమర్శలు చేసినప్పటికీ, చాలా మంది రాజమౌళి పవర్ఫుల్ విలన్‌ను సెట్ చేశారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తోంది.
మహేష్ బాబు కుమార్తె సితార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోకి అడుగు పెట్టకముందే ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోవర్స్ సంపాదించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రెస్ మీట్లలో మాట్లాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. తండ్రి మహేష్ బాబు లాగే సేవా దృక్పథం ఆమెలో కనిపిస్తుంది.
మరోవైపు ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో “మాల్తీని షూటింగ్‌కి తీసుకెళ్తారా?” అని అడగగా, “తీసుకెళ్తాను… హైదరాబాద్ ఇప్పుడు మాల్తీకి ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది” అని చెప్పింది. అదేవిధంగా మహేష్ బాబు కుమార్తె సితారతో మాల్తీకి ఏర్పడిన స్నేహాన్ని గురించి కూడా చెప్పుకొచ్చింది. “సితారతో మాల్తీ అద్భుతమైన సమయాన్ని గడిపింది” అని ప్రియాంక తెలిపారు.
ఇటీవల విడుదలైన మందాకిని లుక్ లో ప్రియాంక చోప్రా పసుపు రంగు చీరలో గన్ ఫైర్ చేస్తూ కనిపించింది. ఈ లుక్ చూసిన వెంటనే రాజమౌళి ఆమె కోసం ఒక స్టైలిష్ జేమ్స్ బాండ్ రోల్ రూపొందించినట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఈవెంట్లో రాజమౌళి సినిమా కథపై ఏదైనా క్లూ ఇస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!