

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా మీద ₹30.48 కోట్లు మోసం కేసు విచారణ కొనసాగుతుండగా, శిల్పా వ్యాపార సామ్రాజ్యం గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.సామాజికవేత్త, రచయిత శోభా డే తాజాగా వెల్లడించిన ప్రకారం, ముంబైలోని శిల్పా శెట్టి సొంత రెస్టారెంట్ ‘బాస్టియన్’ ఒక్క రాత్రిలోనే ₹2 నుండి ₹3 కోట్లు టర్నోవర్ సాధిస్తోంది! Mojo Storyతో మాట్లాడుతూ శోభా డే అన్నారు:
“ముంబైలో డబ్బు ఎలా తిరుగుతోందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక రెస్టారెంట్లో నెమ్మదిగా ఉన్న రోజుల్లో కూడా టర్నోవర్ ₹2 కోట్లు, వీకెండ్స్‌లో ₹3 కోట్లు! నేను విన్నప్పుడు నమ్మలేక స్వయంగా వెళ్లి చూసాను.”
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, బాస్టియన్ 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టాప్ ఫ్లోర్ లగ్జరీ రెస్టారెంట్. ప్రతి రాత్రి 700 మందికి రెండు సీటింగ్స్ — అంటే సుమారు 1,400 మంది డైనర్లు ఒకే సాయంత్రం భోజనం చేస్తారు. అయినప్పటికీ, బయట రోడ్డుపై వేటింగ్ లిస్టు ఉంటుంది.లాంబోర్గినీ, ఆస్టన్ మార్టిన్కార్లలో వచ్చే కస్టమర్లు ప్రతి టేబుల్‌పై లక్షల్లో ఖర్చు చేస్తూ ప్రీమియం టెకీలా బాటిల్స్ తెప్పించుకుంటారని ఆమె చెప్పారు.“అక్కడ 700 మంది కూర్చున్నారు, కానీ నాకు ఒక్కరినీ గుర్తు రాలేదు — అంతా యువకులు, డబ్బు వెచ్చించడంలో ఎటువంటి సంకోచం లేకుండా పార్టీ మూడ్‌లో ఉన్నారు,” అని శోభా డే అన్నారు.
శిల్పా శెట్టి 2019లో రంజిత్ బింద్రాతో కలిసి బాస్టియన్ బ్రాండ్‌లో భాగస్వామిగా చేరారు. అప్పటి నుండి ఆమె హాస్పిటాలిటీ రంగంలో అనేక కొత్త రెస్టారెంట్లతో తన స్థాయిని మరింత విస్తరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!