

టాలీవుడ్ హీరో శర్వానంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘భోగి’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన, తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తన వినోదభరిత చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైట్ల, ఈసారి కూడా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ చిత్రంలో కథానాయికగా ప్రీతి ముఖుందన్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ‘కన్నప్ప’ చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, శర్వానంద్ సరసన నటించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం నవ్వులు, కుటుంబ భావోద్వేగాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకుని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!