
గాసిప్స్

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ మరియు కాజోల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట కలిసి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. ముఖ్యంగా, వారి ప్రేమకథా చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొందించారు.
లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటైన వాటిని షారుక్- కాజోల్ గురువారం ఆవిష్కరించారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే. ఇంతకుముందు ‘హ్యారీ పోటర్’, ‘మేరీ పాపిన్స్’ లాంటి కొన్ని హాలీవుడ్ చిత్రాల విగ్రహాలు కొలువుదీరాయి. విగ్రహావిష్కరణ సమయంలో షారుక్ మాట్లాడుతూ, “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ చిత్రంలో నేను భాగం కావడం నా అదృష్టం” అని తెలిపారు.
.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!