Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలుగు సిని పరిశ్రమ కు మహానటి : సావిత్రి

07:22 AM, 6 డిసెంబర్, 2025
తెలుగు సిని పరిశ్రమ కు మహానటి : సావిత్రి

తెర మీద తొలి కాంతి పుడుతుండగానే, దాని కన్నా ముందు ప్రేక్షకుల హృదయాలను స్పృశించేవి సావిత్రి కళ్లే. కథ మొదలయ్యేలోపే ఆమె కళ్లలోని నవ్వులు, వేదనలు ప్రేక్షకుల హృదయాల్లో చోటు చేసుకునేవి. పాత్రలను ఆమె ధరించేది కాదు ఆ పత్రాల్లా ఆమె శ్వాసించేది, జీవించేది.

మాయాబజార్లో ఆమె చిరునవ్వు తెలుగు పండుగల దీపం లాంటిది. మిస్సమ్మలో ఆమె నడక చిన్నప్పుడు అమ్మ పట్టుకున్న చేయి మరలా మనసుకు గుర్తుచేసేలా ఉంటుంది. సావిత్రికి దుఃఖం అలంకారం కాదు ఆమె జీవితపు నిజం.

కొద్దిమందికే సాధ్యమయ్యే నటన

సావిత్రి కళ్లలో మెరుస్తున్న ప్రతి భావం—స్త్రీ జీవితంలోని సహనం, మౌనం, వెలుగు–చాయల కలయిక. తెరలు మారినా, కాలం గడిచినా, సావిత్రి ఇంకా మనలోనే జీవిస్తోంది. నాకైతే స్మితాపాటిల్ తర్వాత అత్యంత భావోద్వేగ నటన సావిత్రిదే.

ఆమె ముఖంలో వచ్చే భావాలు గులాబీ పువ్వుల్లా సహజం, వాటి పరిమళాల్లా హాయిగా ఉంటాయి. ఆమె మూతి విరుపులో కనిపించే విన్యాసం భావాల ప్రపంచాన్ని అలవోకగా చూపించేది.

ఎనభైకి పైగా సినిమాలు చేసినప్పటికీ రెండు భాషల్లోనూ ఆమె సాధించిన ప్రభావం చిరస్థాయిగానే నిలిచింది.

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం

తెలుగు–తమిళ ప్రేక్షకుల మనస్సుల్లో సావిత్రి స్థానం అందాలకే కాదు, నటనకూ అచంచలమైనది. ఆమె పలుకుల్లో కనిపించే సరళత్వం, అభినయంలో ఒదిగే సహజత్వం ప్రత్యేకమైనవి.

అమాయకత అయినా, చలాకీతనం అయినా, సంతోషం లేదా దుఃఖం ఏ భావమైనా సావిత్రి ఒక్క చూపుతో అద్భుతంగా ఆవిష్కరించేది.

జీవితం ఇచ్చిన బాధలకు కళారూపం

మిస్సమ్మ, బతుకుతెరువు, దేవదాసు, అర్ధాంగి, దొంగరాముడు, మాయాబజార్, మాంగల్యబలం, నర్తనశాల ఇలా సామాజిక, పౌరాణిక చిత్రాల్లో ఆమె నటన అజరామరమైంది.

జీవితంలోని సంక్లిష్టతలు, బాధలను స్వీకరించి వాటిని కళగా మార్చిన అరుదైన నటి సావిత్రి.

1935 డిసెంబర్ 6న కృష్ణా జిల్లాలోని చిర్రావూరులో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే నృత్యంలో శిక్షణ పొందింది. 1950లో మద్రాస్ చేరుకొని సినీ ప్రయాణం మొదలుపెట్టింది.

దేవదాసు నుండి మాయాబజార్ వరకు

వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు ఆమె ప్రతిభను గుర్తించిన తొలి చిత్రం. ప్రతి పాత్రతో ఆమె ప్రయాణం మరింత బలపడింది.

ఎల్వీ ప్రసాద్ తీసిన మిస్సమ్మ ఆమె కెరీర్‌కు మలుపుమార్పు తీసుకువచ్చింది. ఆ తర్వాత మాయాబజార్లో శశిరేఖ పాత్రతో ఆమె మహానటిగా నిలిచిపోయింది.

జీవితంలో నటించలేక వెళ్లిపోయిన మహానటి

సావిత్రి నటించిన వెలుగునీడలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి వంటి చిత్రాలు ఆమెకు నటిగా శాశ్వత గుర్తింపును తెచ్చాయి.

దర్శకురాలిగా చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం, ప్రాప్తం వంటి చిత్రాలను రూపొందించింది. నిర్మాతగానూ తన కృషి చూపింది.

తన జీవితాన్నే కళగా మార్చుకున్న మహానటి చివరికి తన జీవిత పోరాటంలో ఓడిపోయింది. కానీ తెరపై ఆమె వేసిన ముద్ర మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ట్యాగ్లు
మహానటి సావిత్రితెలుగు సినిమా చరిత్రమాయాబజార్మిస్సమ్మతెలుగు నటీమణులుక్లాసిక్ నటనసావిత్రి జీవితం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్
సినిమాలు

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్
రాజకీయాలు

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం
జనరల్

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!