

మే 29న విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు చిత్రం సందిగ్ధం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ చిత్రానికి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘సందిగ్ధం’ అనే అచ్చమైన తెలుగు టైటిల్ చాలా బాగుందని ప్రశంసించారు. అడవుల్లో ఎంతో కష్టపడి సినిమా తీశారని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల మద్దతు చాలా అవసరమని, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. దర్శకుడు పార్థసారధి, నటీనటులు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మే 29న థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!