
న్యూస్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ ప్రత్యేక ఫ్యామిలీ ఆఫర్‌ను ప్రకటించారు. ఇటీవలి కాలంలో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గడంతో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు. టికెట్లతో పాటు లార్జ్ పాప్‌కార్న్‌ను అందిస్తూ ప్రత్యేక ధరలను ప్రకటించారు.
నలుగురు కలిసి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹499కు లార్జ్ పాప్‌కార్న్‌తో ఫ్యామిలీ టికెట్, మల్టీప్లెక్స్‌లలో ₹699కు అదే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ నలుగురు పెద్దలకు వర్తిస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీగానే పరిగణిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ ఆఫర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.




.png&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!