
సినిమాలు

ప్రేమ, హాస్యం, ఉత్కంఠను మేళవించి తెరకెక్కించిన రోమాంచకం సినిమా ట్రైలర్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. రేపు AMB సినిమాస్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరుకానున్నారు. దీంతో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి నెలకొంది.
రోమాంచకంలో ప్రేమ, కామెడీతో పాటు ఉత్కంఠభరితమైన అంశాలను ఆసక్తికరంగా మేళవించినట్లు తెలుస్తోంది.
ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా సినిమా రూపొందినట్లు చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనంతరం రాత్రి 8:10 గంటలకు డిజిటల్‌గా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్‌తో సినిమా కథ, పాత్రలు, వినోద అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!