
క్రీడలు

బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 3 ఇడియట్స్ చిత్రానికి సీక్వెల్ రానున్నట్లు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం. 15 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తర్వాత, రాంచో, ఫర్హాన్, రాజు పాత్రలు మరోసారి తెరపై కనిపించనున్నాయనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, షర్మన్ జోషి మరోసారి కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో సాగిన తొలి భాగానికి భిన్నంగా, కొత్త చిత్రం 15 నుంచి 20 ఏళ్ల టైమ్ జంప్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ బాధ్యతలు, వివాహ జీవితం, పిల్లల పెంపకం, కెరీర్ ఒత్తిళ్లు, మధ్య వయసు సవాళ్లను ఎదుర్కొంటున్న ముగ్గురు స్నేహితుల జీవితాలను హాస్యభరితంగా, భావోద్వేగంగా చూపించనున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!