

తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లతో బిజీగా ఉన్న రామ్ పోతినేని ప్రస్తుతం నటి భాగ్యశ్రీ బోర్సేతో కలిసి అమెరికాలో థియేటర్లను సందర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌కు ఉపేంద్రతో సహా సినిమా టీమ్ హాజరైంది. రిలీజ్ అయినప్పటి నుంచి తనకు అనేక అభినందన కాల్స్ వస్తున్నాయని నిర్మాత రవి తెలిపారు.
థ్యాంక్స్‌గివింగ్ వీకెండ్‌ను దృష్టిలో పెట్టుకుని గురువారం విడుదల చేయాల్సి వచ్చిందని, దీనివల్ల మంచి నెంబర్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని రామ్ పారితోషికం తీసుకోకుండా నిజాం, గుంటూరు హక్కులు మాత్రమే తీసుకున్నారని, ఉపేంద్ర కూడా తక్కువ రెమ్యునరేషన్‌కు ఒప్పుకున్నారని వెల్లడించారు.
దర్శకుడు మహేష్ బాబు పి మాట్లాడుతూ రామ్–ఉపేంద్ర కలయిక తెరపై మ్యాజిక్ సృష్టించిందని అన్నారు. “ఆంధ్ర కింగ్” పాత్ర వింటానే తనకు భావోద్వేగం కలిగిందని, మొదట ఒత్తిడిగా అనిపించినా తరువాత పాత్రతో అనుబంధం పెరిగిందని ఉపేంద్ర తెలిపారు. మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు నుంచి మరింత వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!