

హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా కథ రాసుకుని, దర్శకత్వం వహిస్తూ నటించబోతున్న సినిమా ‘రాపో23’తో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా శ్రీనిధి శెట్టి పేరును పరిశీలించినప్పటికీ, ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను పక్కన పెట్టినట్లు సమాచారం.
దాంతో ప్రస్తుతం కయాడు లోహర్ పేరును పరిశీలిస్తున్నారని, అవసరమైతే సంయుక్త మీనన్‌ను మరో ఆప్షన్‌గా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో రెండు రోజుల పాటు డెమో షూట్ నిర్వహించాలని రామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సక్సెస్ అయితే గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా రామ్ తన తొలి దర్శకత్వ సినిమాకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!