

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ డ్రామా "పెద్ది" పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ పై వచ్చిన ప్రశంసలు ఇంకా కొనసాగుతున్న వేళ, సినిమా టీమ్ ఇప్పుడు ఒక కీలకమైన యాక్షన్ బ్లాక్ ను చిత్రీకరిస్తోంది.
హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీ లో నిర్మించిన భారీ సెట్లో రామ్ చరణ్ తో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొళ్ల ప్రత్యేకంగా ఈ షెడ్యూల్ కోసం రూపొందించారు. సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్న కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ షూట్లో పాల్గొంటున్నారు.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తండ్రి, దంగల్ వంటి చిత్రాలకు యాక్షన్ పర్యవేక్షణ అందించిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ శామ్ కౌశల్ ఈ యాక్షన్ బ్లాక్‌ను పర్యవేక్షిస్తున్నారు. స్టంట్ మాస్టర్ నవకాంత్ నేతృత్వంలో ఈ సన్నివేశాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమా ప్రధాన హైలైట్ కానుండటంతో, టీమ్ దాన్ని అత్యంత గ్రాండ్‌గా మౌంట్ చేస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతి షాట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి ఫైట్ కు ప్రత్యేకమైన కాన్సెప్ట్ మరియు దృశ్య వైభవం ఉండేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో, "పెద్ది" సంగీతం కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొట్టమొదటి సాంగ్ చికిరి చికిరి 110 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి గ్లోబల్‌గా ట్రెండ్ అవుతోంది.
జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రాన్ని మరింత మెరుగుపరుస్తోంది.
"పెద్ది" మార్చి 27, 2026 న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!