

సూపర్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధర్మన్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రాశి ఖన్నా, సిమ్రన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, రామ్ పోతినేని రజినీకాంత్‌కు అల్లుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అశ్వత్ మారిముత్తి సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోందని, మరో 10 రోజుల షూటింగ్ కోసం చిత్ర బృందం మైసూర్‌కు వెళ్లనుందని తెలిపారు. రజినీకాంత్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని పేర్కొన్న అశ్వత్.. ఆయన అంకితభావం, ఉత్సాహం, సినిమాపై ఉన్న మక్కువను ప్రశంసించారు. దిగ్గజ నటుడైనప్పటికీ షూటింగ్ సెట్‌లో రజినీకాంత్ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని, ఆయనతో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని దర్శకుడు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!