

రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ‘టార్టాయిస్’ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనుండగా, ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తయ్యి ప్రస్తుతం అనంతర నిర్మాణ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. కొత్త తరహా కథ, వినూత్న కథనంతో ఈ చిత్రం రూపొందుతోందని పేర్కొన్నారు. నిద్రలో నడిచే అలవాటు ఉన్న కథానాయకుడు తెలియకుండానే హత్యలు చేయడం, ఆ తర్వాత జరిగే పరిణామాల చుట్టూ కథ సాగుతుందని వెల్లడించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!