10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేతన్ అగర్వాల్ మర్డర్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద

Writer: Sreekanth Reddy 11:31 AM, 26 జూన్, 2026
కేతన్ అగర్వాల్ మర్డర్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద

పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఘటన సోషల్ మీడియాలో పురుషులు వర్సెస్ మహిళలు అనే జెండర్ వివాదానికి దారితీసింది. లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు కలిసి నెట్టేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. మహిళల ప్రవర్తనపై నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య, గాయని చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఇటీవలే రష్మిక మందన్నతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసిన రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ఓ ప్రశ్న వేశాడు. "కేతన్ అగర్వాల్ ఘటనను చూసైనా పురుషులపై మహిళలు చేసే అరాచకాలపై ఓ సినిమా తీయండి" అని కోరాడు. దీనికి రాహుల్ చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.

"నేను దీనిని పురుషులపై మహిళలు చేస్తున్న అరాచకంగా చూడట్లేదు. మహిళల రూపంలో ఉన్న కొందరు సైకోలు చేసిన ఘోరమైన నేరంగా మాత్రమే చూస్తున్నాను" అని రాహుల్ బదులిచ్చారు. సమాజంలో మహిళలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే వివక్ష, పురుషుల అణచివేత ఆధారంగానే తాను ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా తీశానని, వికృత మనస్తత్వంతో చేసే వ్యక్తిగత నేరాలను, సమాజంలో ఉండే వ్యవస్థాగత లోపాలను ఒకే తాటిపైకి తెచ్చి చూడలేమని ఆయన స్పష్టం చేశారు.

భర్త ఇచ్చిన ఈ వివరణను స్క్రీన్ షాట్ తీసి చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఇది చదవండి. పెళ్లి చేసుకుంటే రాహుల్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని చేసుకోండి, లేదంటే పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి.. కానీ బాధపడకండి. ఇదొక్కటే నా సలహా.. ఇక మిగతాది మీ ఇష్టం, మీ లైఫ్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సమాజంలో జరిగే నేరాలకు జెండర్ రంగు పులిమి మాట్లాడకూడదంటూ రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన కౌంటర్, దానికి చిన్మయి ఇచ్చిన మద్దతు ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.  

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

ట్యాగ్లు
రాహుల్ రవీంద్రన్చిన్మయి శ్రీపాదకేతన అగర్వాల్ మర్డర్ కేస్జెండర్ ఈక్వాలిటీపెళ్లిగర్ల్ ఫ్రెండ్ మూవీఅన్ లైన్ డిస్కషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?
సినిమాలు

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!