

పురుష: సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రల్లో నటించారు. మే 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తుందని హీరో పవన్ కళ్యాణ్ తెలిపారు. కుటుంబ సమేతంగా థియేటర్‌కి వచ్చి హాయిగా చూసేలా సినిమా ఉంటుందని ఆయన అన్నారు.
నటుడు సప్తగిరి మాట్లాడుతూ దర్శకుడు వీరు వులవల అనుకున్న విధంగానే సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారని చిత్ర బృందం ప్రశంసించింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలిపారు. దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తొలి సినిమా హీరోలా ఎక్కడా కనిపించరని, ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!