

పురుష: చిత్రం మే 22న సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరూ ఉలవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ప్రెస్మీట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు వీరూ ఉలవల మాట్లాడుతూ తాను అనుకున్న విధంగానే సినిమాను తెరకెక్కించానని చెప్పారు. సప్తగిరి సినిమా కథ, స్క్రీన్‌ప్లేపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇతర నటీనటులు కూడా సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మే 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆదరించాలని చిత్రబృందం కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!