
క్రీడలు

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ సిద్ధమైంది. కొత్త హీరో పవన్ కళ్యాణ్ బత్తుల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22 న థియేటర్లలో విడుదల కానుంది. వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ కథతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
వెన్నెల కిషోర్, సప్తగిరి వంటి ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కుటుంబ బంధాలు, సరదా సంఘటనలు, భావోద్వేగాలు కలగలిపిన కథగా ఇది రూపొందింది. సమ్మర్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!