
గాసిప్స్

‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోల అనుమతి కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకూడదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని నిర్మాతలు కోర్టును కోరారు.
సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు, ప్రత్యేక షోల అనుమతులు చాలా ముఖ్యమని నిర్మాతలు తమ వాదనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఈ నిర్ణయం పై సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!