
గాసిప్స్

అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి మనుమడు కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకం వీడియోకు రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించారు. రెండున్నరేళ్ల చిన్న వయసులోనే భక్తిశ్రద్ధలతో లింగాష్టకం పఠించిన చిన్నారి ప్రతిభను ప్రశంసిస్తూ, ప్రభాస్ తన స్వరంతో వీడియోకు ప్రత్యేక ఆకర్షణను జోడించారు.
చిన్నారి భక్తి, ఆధ్యాత్మికత పట్ల చూపిన ఆసక్తి ఎంతో అభినందనీయం అని పేర్కొన్న ప్రభాస్, ఇతర పిల్లలకు కూడా ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. కొండా మురళీ కృష్ణ పటేల్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
చిన్నారి స్వచ్ఛమైన భక్తి, కుటుంబ విలువలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నాయని ప్రభాస్ అభిప్రాయపడ్డారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!