

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పనులు పూర్తయ్యాయని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఈ నెల 7 రాత్రి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా మాట్లాడుతూ ‘పెద్ది’ కథ 70-80ల మధ్య విజయనగరం నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. పొలం గట్టుపై కూర్చొని క్రికెట్ చూస్తున్న అనుభూతి ఈ సినిమా చూస్తే కలుగుతుందని తెలిపారు. మరోవైపు త్వరలోనే ట్రైలర్ విడుదల కానున్నట్లు వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!