

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ విడుదలకు ముందే సీక్వెల్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల వరంగల్-హనుమకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అతనితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ‘ఓజీ 2’ వస్తే ప్రత్యేక అతిథిగా పిలుస్తానంటూ చేసిన వ్యాఖ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఇప్పటికే ‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సీక్వెల్ అవకాశాలపై కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలతో ‘ఓజీ 2’ కూడా ప్లాన్‌లో ఉందా అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!