

శివ కార్తికేయన్, శ్రీ లీల జంటగా, రవి మోహన్, అథర్వ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పరాశక్తి. గతంలో సూర్యతో సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానున్న ఈ సినిమా, తాజాగా ఆదివారం రాత్రి తన తమిళ ట్రైలర్ను విడుదల చేసింది. తెలుగు ట్రైలర్ కొద్దిరోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివకార్తికేయన్ ఆలోచనాత్మకమైన కాలేజ్ విద్యార్థిగా కనిపిస్తే, అథర్వ ఆవేశంతో కొట్లాటలకు దిగే పాత్రలో నటించారు. రవి మోహన్ క్రూరమైన పోలీస్ అధికారిగా, శ్రీలీల కాలేజీ ఉద్యోగినిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ తీవ్రతతో ఆకట్టుకుంటోంది. అతిథి పాత్రల్లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!