

షెరాజ్ మెహదీ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ జనవరి 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, అద్భుతమైన కంటెంట్‌తో కూడిన మంచి సందేశాత్మక చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని తెలిపారు. కథలోని ట్విస్టులు, ఎంటర్టైనింగ్ నేరేషన్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటాయని, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ, నేటి తరం ఆడపిల్లల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. హీరోయిన్లు కృతి వర్మ, విహాన్షి హెగ్డే తమ పాత్రలపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం విశ్వసిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!