
జనరల్

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై ప్రియదర్శి, యూట్యూబ్ స్టార్ నాగదుర్గ జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రియదర్శి, నాగదుర్గ కొత్త పెళ్లి జంటగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
టైటిల్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ నాగదుర్గ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినప్పుడు నాగదుర్గ తనకు 15 నియమాలు పెట్టిందని, అయితే ఆమె స్పష్టత, ఆత్మవిశ్వాసం తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. ఒక తెలుగు అమ్మాయి ఇంత క్లారిటీతో తన అభిప్రాయాలను చెప్పడం ఆనందంగా అనిపించిందని, ఈ చిత్రంలో నాగదుర్గ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!