
.png&w=3840&q=75)
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ" జనవరి 2న పాన్ ఇండియా (తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం) థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో, ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
డీవోపీ, ఎడిటర్ శ్రావణ్ జి.కుమార్: టీమ్ కృషితో ట్రైలర్ మంచి క్వాలిటీ లో రూపొందిందని, సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.
ప్రొడ్యూసర్ వేణుగోపాల్ దీవి: ట్రైలర్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, సినిమా కూడా అదే ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
చిత్ర సమర్పకులు శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి: ట్రైలర్ తనకు నచ్చిందని, చిత్రంలోని ప్రతి ఆర్టిస్ట్ మంచి ప్రదర్శన ఇచ్చిందని, ప్రేక్షకులు సినిమాను కూడా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ రాకేష్ మాధవన్: ఇది తన తొలి ఫీచర్ ఫిల్మ్, ట్రైలర్ చూసిన వారు కొత్త దర్శకుడి పని అనుకోవడం సంతోషంగా ఉంది. సినిమాలో మంచి ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఉన్నాయి. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
హీరోయిన్ యష్న: విలేజ్ లో లోకల్ టాలెంట్ ను సెలెక్ట్ చేసి, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టిస్తామని అన్నారు.
హీరో మాస్టర్ మహేంద్రన్: తెలుగు ప్రేక్షకుల ప్రేమ తెలుసు, మంచి కంటెంట్, ఎమోషన్ ఉన్న కథలను మాత్రమే చేయాలని కోరుకుంటానని, కథలో హీరో తప్పు చేయకుండా సబ్యంగా ఎదుర్కొన్న సీన్ ఆసక్తికరమని చెప్పారు.
ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు: ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాకు వచ్చానని, స్నేహితుడు శశిధర్ సూచించిన లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించామన్నారు. షూటింగ్ సమయంలో తుఫాన్లు ఎదుర్కొన్నప్పటికీ, టీమ్ కృషితో సినిమా సిద్ధమైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!