

ఇటీవలి కాలంలో సినీ ప్రేక్షకులు విభిన్నమైన కంటెంట్‌తో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. థ్రిల్ పంచే సరికొత్త స్క్రీన్‌ప్లేలు ఉన్న చిత్రాలకు థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ నటుడు సంజయ్ రావ్ హీరోగా ‘హిట్ అండ్ రన్’ అనే కొత్త క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. హీరో సంజయ్ రావ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి అంచనాలను సృష్టించింది.
తాజాగా హీరోయిన్ నటాషా సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె సాక్షి అనే పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. పోస్టర్‌లో ఆమె లుక్ సీరియస్‌గా, ఆకట్టుకునేలా ఉంది. ఈ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఆమె చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!