
క్రీడలు

దర్శకుడు వేణు యెల్దండి రూపొందిస్తున్న ‘యల్లమ్మ’ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు బలంగా వినిపిస్తోంది.
గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగ ప్రధాన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మృణాల్ నటన సరైన ఎంపిక అవుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ‘బలగం’ విజయంతో వేణుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉండగా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!