

మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ధనుష్ తో ఈ రోజు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై మృణాల్ స్పందిస్తూ, “నాకు తెలియకుండానే నేను స్టేట్మెంట్లు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 14)ని నాకు ఏప్రిల్ 1లా మార్చేశారు” అంటూ సెటైరికల్‌గా చెప్పింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పెళ్లి తన జీవితంలో తప్పకుండా ఉంటుందని కానీ సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడే చేస్తానని స్పష్టం చేసింది. కేవలం ఒత్తిడితో కాదు, నిజమైన అనుబంధం ఉన్న వ్యక్తితోనే జీవితం పంచుకోవాలనేది తన అభిప్రాయం అని చెప్పింది.
ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి నటించిన ‘దో దీవానే షెహర్ మే’ సినిమా ఈ నెల (ఫిబ్రవరి) 20 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఒక ఇంపర్ఫెక్ట్ లవ్ స్టోరీగా రూపొందింది. మొత్తానికి పెళ్లికి తాను సిద్ధమే కానీ తన మనసుకు నచ్చిన వ్యక్తితోనే అని మృణాల్ క్లియర్ చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!