

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. 65 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఆయన, వరుస బ్లాక్ బస్టర్లతో మరోసారి తన స్టామినా నిరూపించారు. ఈ ఏడాదిలోనే L2: ఎంపురాన్, తుడరమ్, హృదయపూర్వం వంటి మూడు భారీ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.ఇప్పుడు ఆయన మళ్లీ రూ.235 కోట్ల బ్లాక్ బస్టర్ తుడరమ్ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తితో జట్టు కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా ఇంతకుముందులాగే మ్యాజిక్ చేయగలరా? అనే ఆసక్తి పెరిగింది.
ప్రథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన L2: ఎంపురాన్ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, హృదయపూర్వం కామెడీ ఎంటర్టైనర్ కూడా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఆయన నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా వృషభ నవంబర్ 6న విడుదల కానుంది. భా. భా. బా చిత్రంలో స్పెషల్ రోల్, దృశ్యం 3తో పాటు, మమ్ముట్టితో కలిసి పేట్రియాట్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ప్రొడ్యూసర్ రెంజిత్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, తరుణ్ మూర్తి ప్రస్తుతం చేస్తున్న టార్పెడో, ఆపరేషన్ కాంబోడియా చిత్రాల తర్వాత మోహన్ లాల్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. తుడరమ్లో చూపిన మోహన్ లాల్ నటన, తరుణ్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాబట్టి ఈసారి ఈ జంట ఏ జోనర్లో, ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!