

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ‘దృశ్యం’ సిరీస్ ఇప్పుడు మూడో భాగంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ కథకు కొనసాగింపుగా వస్తున్న ‘దృశ్యం 3’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ వెర్షన్‌కు ముందే మోహన్‌లాల్ నటించిన అసలు మలయాళ రూపం తెలుగులో విడుదల కానుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు ప్రేక్షకుల్లో ‘దృశ్యం’ అంటే వెంకటేష్ నటన గుర్తుకొచ్చే స్థాయిలో ఆ చిత్రం విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కథను మోహన్‌లాల్ తన శైలిలో ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరిత మలుపులు, బలమైన కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రానికి మంచి స్పందన రావడంతో ‘దృశ్యం 3’పై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!