

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. 500కి పైగా సినిమాల్లో నటించి, నిర్మాతగా కూడా గుర్తింపు పొందిన లెజెండరీ వ్యక్తిత్వం. తన కెరీర్ ప్రారంభంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా సక్సెస్ ఫుల్, విస్తృతమైన కెరీర్‌తో ఇండస్ట్రీలో 50 ఏళ్ల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. కొద్ది కాలంగా బ్రేక్ తీసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ విలన్ పాత్రల్లో బిజీ అవుతున్నారు. నాని-శ్రీకాంత్ ఓదెల్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది.
అలాగే, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలోనూ మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను మురిపించబోతున్నారు. ఈ ప్రేమకథ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోంది, కథానాయికగా రషా థడానీ ఉన్నారు. సి. అశ్వనీదత్ సమర్పణ, పి. కిరణ్ నిర్మాణంలో చందమామ కథలు పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!