

జితేంద్ర జోషి హీరోగా, రవీంద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వంలో రూపొందిన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ 'మ్యాజిక్' జనవరి 1, 2026న రిలీజ్ కానుంది. టుత్రీ వెంచర్స్ బ్యానర్‌పై రాజు సత్యం నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే 9 అంతర్జాతీయ అవార్డులు సాధించి, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి భారీ సపోర్ట్ అందుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కు దర్శకుడు మెహర్ రమేష్, మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మెహర్ రమేష్ ట్రైలర్‌ను గ్రిప్పింగ్‌గా అభివర్ణించి, హైదరాబాద్ మరాఠీ ప్రేక్షకులు చూసి హిట్ చేయాలని కోరారు. గీతా తెలుగు సబ్‌టైటిల్స్‌తో రావాలని ఆకాంక్షించగా, అరుణ్ కుమార్ మరాఠీ ఇండస్ట్రీ ప్రత్యేకతను కొనియాడి అన్ని భాషల్లోకి రావాలని ఆశించారు. హీరో జితేంద్ర జోషి తన క్లిష్టమైన పాత్ర గురించి చెప్పగా, నిర్మాత రాజు సత్యం హైదరాబాద్ రిలీజ్‌కు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!