

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రారా’ మ్యూజిక్ లవర్స్‌ను ఊపేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, అభిమానులను ఫుల్ ఎనర్జీ మోడ్‌లోకి తీసుకెళ్లింది. విడుదలైన క్షణం నుంచి యూట్యూబ్, రీల్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాటకు విపరీతమైన స్పందన లభిస్తోంది.
ఈ పాటపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించడం వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా ద్వారా ‘రయ్ రయ్ రారా’ పాటలో ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ అద్భుతంగా కలిసిపోయాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ప్రస్తావిస్తూ, “సూపర్ స్పీడ్‌లోనూ అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులు వేస్తూ కనిపించిన చరణ్‌ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది” అని తెలిపారు.
సాంగ్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. అలాగే సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ అందించిన బీట్లు పాటకు ప్రాణం పోశాయని కొనియాడారు. డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ప్రత్యేకంగా మెప్పించిందని పేర్కొన్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్, సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ పదాలు, నిర్మాత వెంకట సతీష్ కిలారు విజన్ అన్ని కలిసి ఈ సాంగ్‌ను ఒక మైలురాయిగా నిలబెట్టాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
దీంతో, రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో మెగాస్టార్‌కు “ధన్యవాదాలు నాన్న మీ ప్రోత్సాహం నాకు అత్యంత విలువైనది. ఇది నాకు స్థిరంగా ఉండటానికి, కఠినంగా పనిచేయడానికి, ఇంకా అధిక స్థాయికి చేరుకోవడానికి ప్రేరణ ఇస్తుంది” అని ప్రతిస్పందించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!