
సినిమాలు

అగ్ర కథానాయకుడు చిరంజీవి తన కొత్త సినిమాను ఫుల్ జోష్తో ప్రారంభించారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘మెగా 158’గా ప్రచారంలో ఉంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే కారులో రావడం అభిమానులను ఆకట్టుకుంది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా, చిరు కుమార్తె సుస్మిత కెమెరాను ఆన్ చేశారు.
ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆమె చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం బాబీ-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!