

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న మలయాళ బ్యూటీ మమిత బైజు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా విడుదలైన ‘డ్యూడ్’ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం మమిత చేతిలో దాదాపు అర డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం.2017లో మాలీవుడ్‌లో సర్వోపరి పాలకరన్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన మమిత, ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదుగుతూ వచ్చింది. 2024లో వచ్చిన ప్రేమలు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. వరుసగా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.
రెబల్ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన మమిత, తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మమిత పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పుడేమో తాజా టాక్ ప్రకారం, తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన మమిత బైజు నటించబోతోందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ ఏడాది మొత్తం అమ్మడి క్యాలెండర్ షూటింగ్‌లతో నిండిపోయిందని చెప్పాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!