

టాలీవుడ్లో తన విభిన్న కథలతో, ప్రత్యేకమైన స్టైల్‌తో కొత్త దృక్పథాన్ని చూపించిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా పరిచయం అయిన నాగి, మహానటితో నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆయన నిర్మాతగా నిర్మించిన జాతిరత్నాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల ప్రభాస్‌తో చేసిన కల్కి 2898 ADతో పాన్-ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించిన నాగ్ అశ్విన్, ప్రస్తుతం కల్కి 2 పనుల్లో బిజీగా ఉన్నారు. అయినా కూడా, దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా, మరోవైపు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఇప్పుడిక నాగ్ అశ్విన్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఒక కొత్త సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. సింగీతం గారి దర్శకత్వంలో చేయని జానర్ లేదు, ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రయోగాలతో ఉంటాయి. నాగ్ అశ్విన్‌కూ సింగీతంపై ప్రత్యేక అభిమానం ఉండటంతో, ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ కొత్త సినిమా పూర్తిగా సింగీతం మార్క్‌తో ఉండబోతోందని, ఇందులో కొత్త నటులు నటించనున్నారని, సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందించనున్నారని సమాచారం. లెజెండరీ డైరెక్టర్‌కు నాగ్ అశ్విన్ వంటి అభిరుచి ఉన్న నిర్మాత అండగా ఉంటే, అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!