

ప్రపంచ శాంతి సందేశంతో రూపొందుతున్న “కింగ్ బుద్ధ” చిత్ర బృందం పాదయాత్రలో పాల్గొంది. థాయ్‌లాండ్‌కు చెందిన 60 మంది బౌద్ధ భిక్షువులు కర్ణాటకలోని స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తుర్కయాంజిల్ వరకు జరిగిన 17 కిలోమీటర్ల యాత్రలో దర్శకుడు సత్యారెడ్డి మరియు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ భిక్షువులు సత్యారెడ్డికి గౌతమ బుద్ధుడి లాకెట్ ధరింపజేసి ఆశీర్వదించారు.
సత్యారెడ్డి మాట్లాడుతూ, “కింగ్ బుద్ధ” చిత్రాన్ని ఇప్పటికే 10 దేశాల్లో చిత్రీకరించామని, మరిన్ని 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉందని తెలిపారు. హాలీవుడ్, బాలీవుడ్, దక్షిణ భారత ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారని, ప్రపంచంలోని 100కి పైగా భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యమని చెప్పారు. బుద్ధుని జీవితం, పంచశీల సిద్ధాంతాలపై ఈ చిత్రం నిర్మితమవుతోందని, ప్రపంచ శాంతి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు నిర్వహించాలని ఆకాంక్షించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!