
జనరల్

కియారా అద్వానీ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. తన కూతురు భవిష్యత్తులో స్వేచ్ఛగా జీవించాలనుకుంటానని, డేటింగ్ లేదా వివాహం వంటి విషయాల్లో ఆమె నిర్ణయానికే ప్రాధాన్యం ఉండాలని తెలిపారు. పిల్లలపై అధిక నియంత్రణ కంటే సరైన మార్గనిర్దేశం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రతి సంబంధం ఒక పాఠం నేర్పుతుందని, అనుభవాల ద్వారానే వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుందని కియారా పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను కొందరు ప్రోగ్రెసివ్ ఆలోచనలుగా స్వాగతిస్తుండగా, మరికొందరు సంప్రదాయ విలువలకు వ్యతిరేకమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!