

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి కీర్తి సురేశ్ మరోసారి తన అంకితభావంతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఒక సినిమా కోసం ఆమె ఏకంగా నాన్‌స్టాప్‌గా 9 గంటల పాటు డబ్బింగ్ చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బింగ్ స్టూడియోలో అలసిపోయిన లుక్‌తో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, “ 9 గంటల డబ్బింగ్ తర్వాత నా పరిస్థితి ఇది ” అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ఆమె పని పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పడం కీర్తి సురేశ్ ప్రత్యేకతగా మారింది. ‘ మహానటి ’ చిత్రంలో సావిత్రి పాత్రకు తెలుగు, తమిళ భాషల్లో ఆమె చెప్పిన డబ్బింగ్ జాతీయ అవార్డును అందించింది. ఇటీవల ‘ కల్కి 2898 ఏడీ ’లో ‘ బుజ్జి ’ అనే ఏఐ క్యారెక్టర్‌కు ఐదు భాషల్లో వాయిస్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ రౌడీ జనార్ధన ’, తమిళంలో లాయర్ పాత్ర, హిందీలో ‘ అక్కా ’ వెబ్ సిరీస్, మలయాళంలో ‘ తొట్టం ’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘ తొట్టం ’లో కీర్తి సురేశ్ కొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించనుందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!