

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో వరుసగా బిజీగా ఉన్నారు. ఇటీవల సత్యవాన్ సావిత్రి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్థన్, వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీతో పాటు ది ప్యారడైజ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ బిజీ షెడ్యూల్ మధ్య ఒక షూటింగ్ లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు ప్రయాణిస్తూ 41 గంటల పాటు నిద్రపోకుండా పనిచేశానని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఒకే రోజులో దాదాపు 20 గంటలు పని చేశానని, అలసట కారణంగా సోషల్ మీడియాలో కూడా స్పందించే శక్తి లేకపోయిందని కీర్తి తెలిపారు. అయినప్పటికీ ఈ అవకాశాలను దేవుడి ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అనంతరం "I Will Survive" అని రాసి ఉన్న తెల్లటి టీ-షర్ట్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ, ఆ సందేశం తన రోజును ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఆమె అంకితభావం, సానుకూల దృక్పథాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!