

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా, ఆస్కార్ అవార్డు గ్రహీత మరియు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన ప్రత్యేక సంగీత కచేరితో సందడి చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ఈ సమ్మిట్‌కు ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఈ సందర్భంలో 90 నిమిషాల పాటు కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే వీణా విద్వాంసురాలు పి. జయలక్ష్మీ వీణా వాద్యం, కళా కృష్ణ ఆధ్వర్యంలోని పేరణి నాట్యం, మాంత్రికుడు సామల వేణు ఇంద్రజాల ప్రదర్శన ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈ వేడుకల్లో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక రీతిలో ప్రదర్శించబడతాయి. కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి కళా ప్రదర్శనలతో అతిథులను ఆత్మీయంగా స్వాగతించనున్నారు.
డిసెంబర్ 10 నుంచి 13 వరకు ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులూ నిరంతరంగా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించబడుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!