
రాజకీయాలు

సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా తాజాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మొదట విజయ్ కోసం సిద్ధం చేసినట్లు దర్శకుడు ఆర్జే బాలాజీ తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లేముందు తన చివరి సినిమాగా దీన్ని చేయాలని విజయ్ భావించినట్లు చెప్పారు. స్క్రిప్ట్‌పై పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, రాజకీయ కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం సూర్యకు తగినట్లు కథను మార్చి తెరకెక్కించారు.
ఈ సినిమా కథ రూపుదిద్దుకోవడంలో విజయ్ కీలక పాత్ర పోషించారని బాలాజీ వెల్లడించారు. ఆయన అడిగిన ప్రశ్నలు స్క్రిప్ట్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాయని చెప్పారు. అందుకే టైటిల్ కార్డులో విజయ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు. సినిమా విడుదలైన తర్వాత విజయ్ స్వయంగా ఫోన్ చేసి చిత్ర బృందాన్ని అభినందించినట్లు బాలాజీ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!