
జనరల్

రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంష్’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం 40 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.291.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. ఆరో వారంలోనూ సినిమా జోరు కొనసాగుతోంది. ఆరో మంగళవారం ఒక్కరోజే రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంది.
భారీ బడ్జెట్ సినిమాలు భారీ ప్రమోషన్లు, ఖరీదైన వీఎఫ్‌ఎక్స్, స్టార్ పవర్‌పై ఆధారపడుతుండగా.. ‘హనుమాన్ అంష్’ ఆధ్యాత్మిక నేపథ్యం, సాంస్కృతిక అనుబంధం, విశ్వాసం ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్రబృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మైలురాయికి సినిమా చేరువవుతున్న నేపథ్యంలో ఈ వసూళ్లపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!