

కామెడీ నటుడు సత్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జెట్లీ’ ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకుంటోంది. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. రియా సింఘా కథానాయికగా నటిస్తుండగా, వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు.
గ్లింప్స్ మొత్తం రితేశ్ రానా మార్క్ సెటైరికల్ కామెడీతో పాటు సత్య టైమింగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. చివర్లో వెన్నెల కిశోర్ – సత్య మధ్య సంభాషణ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు రితేశ్ రానా మాట్లాడుతూ.. “ఈ సినిమా మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. కాబట్టి హెవీ బ్రేక్‌ఫాస్ట్ లేకుండా థియేటర్‌కు రాకండి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సినిమా మొత్తం విమానంలోనే జరిగే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండగా, ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. హీరో సత్య మాట్లాడుతూ, “ఈ సినిమాలో హీరో అనే ఫీలింగ్ ఉండదు.. యాక్షన్‌లో కూడా కామెడీ కనిపిస్తుంది” అని చెప్పారు. మొత్తానికి ‘జెట్లీ’ ప్రేక్షకులకు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించబోతోందని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చింది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!