
ఓటీటీ

రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయవాడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, జాన్వీ కపూర్ తెలుగు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె సింపుల్‌గా, క్యూట్‌గా స్పీచ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఈవెంట్లో చిరంజీవి–శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని ప్రసిద్ధ “మానవా ఓ మానవా” డైలాగ్‌ను జాన్వీ పలికింది. ఆమె చెప్పిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఒక్క డైలాగ్‌తోనే తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!