

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాలో “అప్పలసూరి” అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న జగపతిబాబు తాజాగా ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెజెండ్ తర్వాత దాదాపు 100 సినిమాలు చేసినప్పటికీ, కొద్ది పాత్రలే తనకు గుర్తుండిపోయాయని, వాటిలో పెద్దిలోని అప్పలసూరి పాత్ర కూడా ఒకటని చెప్పారు. సినిమా విడుదల తర్వాత ఈ పాత్ర తన కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక రామ్ చరణ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై కూడా జగపతిబాబు ఘాటుగా స్పందించారు. సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడ్డాడని, గాయాలు అయ్యేంతగా శ్రమించాడని చెప్పారు. ప్రమోషన్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, థియేటర్స్ సమస్యలు వంటి ఎన్నో ఒత్తిళ్ల మధ్య చిన్న విషయాలు మర్చిపోవడం సహజమని అన్నారు. అలాంటి విషయాలను పట్టుకుని ట్రోల్ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ట్రోలింగ్ వల్ల చరణ్‌కు ఎలాంటి ప్రభావం ఉండదని, ఆయన అంకితభావంతో పనిచేస్తున్నారని జగపతిబాబు ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!