

తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న రాజకీయ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని నెలలుగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతున్న ఈ చిత్రానికి తాజాగా కీలకమైన క్లియరెన్స్ లభించినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రివైజింగ్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే అధికారిక సెన్సార్ సర్టిఫికేట్ అందే అవకాశం ఉందని సమాచారం. దీంతో సినిమాను జూన్ 19న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ రంగ ప్రవేశం తర్వాత విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇదేననే ప్రచారం సినిమాపై భారీ ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజకీయ అంశాలు, సామాజిక సందేశం, మాస్ యాక్షన్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయని సమాచారం. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య పోటీ నెలకొన్నట్టు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టర్లు, లీక్ అప్డేట్స్ వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!