

ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆసక్తికర చిత్రాల్లో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్ 100’ కూడా ఒకటి. కార్తీక్ బి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు తక్కువగానే ఉన్నప్పటికీ అభిమానులను ఆకట్టుకున్నాయి. సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే విడుదలకు సిద్ధమవుతున్న ‘దాదా’, ‘రియాలిటీ’ చిత్రాలతో పోలిస్తే ప్రచార విషయంలో ‘కింగ్ 100’ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది.
ఆ రెండు సినిమాల నుంచి ఇప్పటికే పాటలు విడుదలవుతూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. డబ్బింగ్ సినిమా ‘కింగ్’ నుంచి కూడా పాటలు వస్తున్నాయి. కానీ నాగార్జున సినిమా నుంచి మాత్రం ఇంకా అలాంటి హడావుడి కనిపించడం లేదు. ప్రస్తుతం చిత్ర బృందం షూటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టబు తదితరులు నటిస్తున్నారు. నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!